Sr manmatha nama samvatsara kala nirnaya panchangam 2015-2016
DAIVAGNA. L.S.SIDDHANTHY
శ్రీ కంచి కామకోటి పీఠ పరిపాలిత శ్రీ మన్మథ నామ సంవత్సర కాలనిర్ణయ పంచాంగం
"దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి"
సృష్ట్యాది గత సౌరాబ్దాః ౧౯౫,౫౮,౮౫,౧౧౬
వర్తమాన మహాయుగ గతాబ్దాః ౩౮,౯౭,౨౧౫
వర్తమాన కలియుగ గతాబ్దాః ౫,౧౧౬
శాలివాహన శక గతాబ్దాః ౧౯౩౭
శ్రీమత్ శంకరాచార్య అవతార గతాబ్దాః ౨౦౮౭
ప్రభవాది ౨౯
పంచాంగము శ్రౌత స్మార్తాది సకల సత్కర్మానుష్టానములకు ఆధారభూతమైనది.
జటిల గణిత సాధ్యమైన పంచాంగణనము బహుప్రాచీన కాలము నుండి వారి వారి సాంప్రదాయములను అనుసరించి చేయబడుచున్నవి.
కాగా కొన్ని పంచాంగములయందు గ్రహణాది ప్రత్యక్ష గోచారములు కూడా తప్పిపోవు ప్రమాదములు మనము చూచుచున్నాము.
ఇట్టి దోషములు తప్పిదములు రాకుండా ఉండాలని కంచి పరమాచార్యుల వారు సుమారు ౧౧౦ సంవత్సరముల నుండి జ్యోతిష పంచాంగ పండిత సదస్సులను భారతదేశములోని ప్రముఖులైన జ్యోతిష, పంచాంగ, ఖగోళ, తర్క, మీమాంస, వ్యాకరణ, సంస్కృత, స్కంధత్రయ, మతత్రయ పండితులను, ధర్మశాస్త్ర పండితులను పిలచి శ్రీమఠమున నిర్వహించడము అవిచ్ఛినన్నముగా జరుగుతున్నది.
అట్టి సభయందు తెలంగాణ రాష్ట్రం, నల్లగోడ జిల్లా, ఆలేరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతి సంవత్సరము గణిస్తూ వెలువరిస్తున్న శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగల, మౌఢ్య, పుష్కర, సం