Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

nelavanka jan -march 2023 monthly magazaine

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
T
e
l
u
g
u
‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬
Vol 17, Issue: 99 Jan - March - 2023
ఆత్మ వాస
్...
అల్
లా హ్‌
! ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు.  
ఆయన సజీవుడు,  విశ్వ వ్యవస
్థ కు ఆధారభూతుడు  
ఆయనకు కునుకు రాదు మరియు ...
Jan - Mar. 2023
8
2
Printing
design: 995 700 34
HOTELINE
‫الروح‬ ‫حول‬ ‫االوهام‬ ‫إزالة‬ * ‫حياتك‬ ‫هدف‬ ‫على‬ ‫تعرف‬ * ‫ا...
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 24 Publicité

nelavanka jan -march 2023 monthly magazaine

Télécharger pour lire hors ligne

nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి

నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..

అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము

nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి

నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..

అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము

Publicité
Publicité

Plus De Contenu Connexe

Plus par Teacher (20)

Plus récents (20)

Publicité

nelavanka jan -march 2023 monthly magazaine

  1. 1. T e l u g u ‫البشرى‬ ‫مجلة‬ ‫ملحق‬ - )‫التلغوية‬ ‫(باللغة‬ ‫الهالل‬ ‫مجلة‬ Vol 17, Issue: 99 Jan - March - 2023 ఆత్మ వాస ్త వికత విజయానికి వారధి వివేకం ఇస ్ల ాం మరియు క్ రీ డా స్ఫూర్తి
  2. 2. అల్ లా హ్‌ ! ఆయన తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస ్థ కు ఆధారభూతుడు ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస ్త మూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ ్ఞ లేకుండా సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ ఞా నవిశేషాలలో ఏ విషయమునూ వారు గ ్ర హించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష ్ట ించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత ్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు సర్వోత ్త ముడు., (దివ్య ఖురాన్/ 255 :2) మానవులందరి నిజ ఆరాధ్యుని పరిచయం
  3. 3. Jan - Mar. 2023 8 2 Printing design: 995 700 34 HOTELINE ‫الروح‬ ‫حول‬ ‫االوهام‬ ‫إزالة‬ * ‫حياتك‬ ‫هدف‬ ‫على‬ ‫تعرف‬ * ‫ايجابيا‬ ‫كن‬ * ‫وسلم‬ ‫عليه‬ ‫الله‬ ‫صلى‬ ‫محمد‬ ‫االنبياء‬ ‫خاتم‬ * ‫القرآن‬ ‫من‬ ‫العالم‬ ‫استفاد‬ ‫ماذا‬ * ‫السعادة‬ ‫مفتاح‬ ‫الحكمة‬ * ‫ألزيدنكم‬ ‫شكرتم‬ ‫لئن‬ * ‫االسالم‬ ‫في‬ ‫الرياضة‬ * ‫االسالم‬ ‫في‬ ‫السن‬ ‫كبار‬ ‫رعاية‬ * ‫لوالديك‬ ‫بارا‬ ‫كن‬ * Vol 17, Issue 99 చరితగా చదివే తరములకు మనమో స్ఫూర్తి సంతకం అవుదాం! మనం ఖురాన్ వ ై పు ఎందుకు మళ్ళాలి? 12 ఇస ్ల ాం మరియు క్ రీ డా స్ఫూర్తి
  4. 4. 2 2023 ఈ దేశ ధరణిలో అందాల బంధం ఉంది. ఈ దేశ ఈ గాలిలో ఆత్మీయ రాగం ఉంది. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, రాష్ట్రం ఏదైనా - అంతిమంగా అందరం - మనమందరం భారతీయులమే. "భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు" అన్న ఐక్యతా నినాదం...ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయులు పలికే జాతీయభావం దేశ నలుమూలలా పత్రిధ్వనిస్తూనే వుంది. మంచి దేశం అంటే అన్ని సమయాల్లో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకునే ప్రదేశం. ఆవు దూడ చనిపోతే, గడ్డితో ఆవుదూడ బొమ్మను తయారుచేసి... ఆవును మోసం చేసి, పాలు పితుక్కుంటారు... కదా? అలాగే, ప్రజలకు అందివ్వాల్సింది అందివ్వకుండా, వారి నుండి లాక్కునేది లాక్కోవడం నేటి రాజకీయ వ్యవస్థ చేస్తున్న పని. మరి యువత మాత్రం - నేను, నా కుటుంబం, నా కెరీర్‌కి పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వ్యవస్థలు నాశనమవుతున్నా నా మతం, నా కులం గొడవలో కొట్టుకు పోతోంది యువత! యువతలో జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం, సహనం, శౌర్యం, సాహసం వంటి గుణాలను పెంపొందించాలి. వారిలో వున్న సాంస్కృతిక నైపుణ్యాన్ని వెలికి తీయాలి. సామాజిక సమస్యలను అర్ధం చేసుకొంటూ వాటి పరిష్కారంలో యువత భాగస్వామ్యం పెరగాలి. 'నా కలల భారతం'లో మహాత్మా గాంధీ ఇలా రాశారు: "నా దృష్టిలో దేశాన్ని ప్రేమించడానికీ, సాటి మనుషుల్ని ప్రేమించడానికి మధ్య ఏమీ తేడా లేదు. ఇవి రెండూ ఒకటే. నేను మానవజాతిని ప్రేమిస్తాను కాబట్టే దేశాన్ని కూడా ప్రేమిస్తాను. ఒక దేశాభిమాని జీవనానికీ, ఒక గణం లేదా తెగ పాలకుడి జీవనానికి మధ్య తేడా ఏమీ లేదు. ఒక గొప్ప దేశాభిమానికి తోటి మనుషుల పట్ల అంతే గొప్ప ప్రేమ లేనట్టయితే, అతడి దేశాభిమానం లోపభూయిష్టమైందని చెప్పక తప్పదు." మరో సందర్భంలో ఆయన ఆయన మాట - మా జాతీయవాదం ఇతర దేశాలకు సంక్షోభం సృష్టించే తరహా జాతీయవాదం కాదు. ఎందుకంటే, మేం ఇతరులు మమ్మల్ని దోచుకోవడాన్ని అనుమతించనట్టే, మేం కూడా ఇతరులెవ్వరినీ దోచుకోం. స్వరాజ్యంతో మేం సంపూర్ణ మానవజాతికి సేవ చేస్తాం" అని గాంధీజీ చాలా స్పష్టమైన చరితగా చదివే చరితగా చదివే తరములకు తరములకు మనమో స్ఫూర్ తి మనమో స్ఫూర్ తి సంతకం అవుదాం! సంతకం అవుదాం! చరితగా చదివే తరములకు మనమో స్ఫూర్తి సంతకం అవుదాం!
  5. 5. 3 2023 మాటల్లో రాశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వ్యాఖ్యానించినట్లు- ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక ప్రభుత్వ రూపం కాదు. ప్రాథమికంగా దానికి అర్ధం... ప్రజలంతా కలిసిమెలిసి జీవించడం. సాటి మనుషుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం. ప్రజాస్వామ్యమంటేనే ప్రజాభిప్రాయం! ఏ రూపం లోనైనా దానికి కళ్లెం వేయడానికి, సంకెళ్లు వేయ డానికి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు వేస్తాయి. ఎదుటివాడు ఏ జాతివాడు, ఏ మతం వాడు, ఏ ప్రాంతం వాడు అనేది చూడకుండా మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమతో, గౌరవంగా మాట్లాడితే - అన్ని సామాజిక వర్గాల మధ్య సంబంధం చల్లగా ఉంటుంది. రాజ్యం తన విశేషమైన అధికారాలతో జాతీయ సమగ్రతను పెంచగలదు... అన్ని రకాల విచ్ఛిన్నకర శక్తులనూ ప్రోత్సహించగలదు... వలసవాద రాజ్య రెండో దాన్ని ఎంపిక చేసుకుంది' అంటారు ప్రఖ్యాత చరిత్రకారులు బిపిన్ చంద్ర. 'మొత్తం రాజకీయ ఆర్థిక అధికారాలను రాజ్యం తన గుప్పిట పట్టిన చోట ధర్మం దారితప్పుతుంది' అన్నది పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ హెచ్చరిక! 'వారు మొదట యూదుల కోసం వచ్చారు/ నేను యూదును కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు క్రైస్తవుల కోసం వచ్చారు/ నేను క్రైస్తవుడ్ని కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు/ నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు నా కోసం వచ్చారు/ నన్ను రక్షించేందుకు ఎవరూ మిగల్లేదు' అంటాడో జర్మనీ కవి. భారతదేశం ఎంతో విశాలమైన దేశం. ఇంత వైశాల్యం కలిగిన దేశం ఒక్క రాత్రిలో పరిణామం చెందదు. దానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ అది ఒక పరిష్కార దిశగా నడవడం మొదలు పెడితే అది ఎంతో మేలైన విషయమే..! అది ఒక సరైన దిశలో నడుస్తూ ఉంటే, మనందరమూ కూడా దానిని మరింత వేగంగా ముందుకి నడిచేలాగా తొయ్యవచ్చు. కానీ; అది ఒకవేళ తప్పు దిశగా నడుస్తూ ఉన్నట్లయితే, మనం దానిని మరింత వేగంగా ముందుకి తోసినట్లితే అప్పుడు అది పూర్తిగా తప్పు దిశగా వెళ్లి, తప్పు దశకు చేరుకుంటుంది. మనం మన మతానికి చెందిన వారు బావుండాలని, మన పరివారానికి చెందిన వారు బాగుండాలని, మన భాష వారు బాగుండాలని, మన ప్రాంత ప్రజలు బాగుండాలని, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలని మనం మన మతానికి చెందిన వారు బావుండాలని, మన పరివారానికి చెందిన వారు బాగుండాలని కోరుకుంటన్నాం, మన భాష వారు బాగుండాలని కుంటాము. దేశం అంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి మాట రీత్యా - వీరంతా మన దేశ పౌరులే. ఒక విధంగా వీరి మేలు కోరడం దేశ మేలు కోరడమే. కానీ, మ‌ నం ఏరోజైనా మ‌ న మాతృభూమి బాగు గురించి, దాని ఆరోగ్యం గురించి ఆలోచించామా? మన మాతృ భూమి అభివృద్ధి కోసం కృషి చేశామా? ఎప్పుడూ నా మాతం, నా కులం, నా భాష, నా ప్రాంతం, నా రాష్ట్రం అనే ఇరుకు చిత్రలోనే బిక్కు బిక్కుమంటూ బతకడమేనా, లేదా - నా దేశం, నా ప్రజలు అన్న సాత్విక సువిశాల భావనతో, సహిష్ణుత, సమతా భావంతో అందరితో కలిసి అందరిని దేశ అభివృద్ధిలో భాగస్తుల్ని చేస్తూ విజయ శిఖరాలను చేరుకోవడమా? నిర్ణయం మనదే! దేశం మనకేమిచ్చిందన్న ఆలోచన మాని మనం దేశానికి ఏం ఇవ్వగలం? అన్న ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాలి. సరైన ప్రారంభమే సగం విజయం. 'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ' అన్నట్టే ఏడాది మొదట్లోనే సరైన దిశా నిర్దేశం చేసుకోగలిగితే దేశాన్ని, సమాజాన్ని సంరక్షించుకోగల సత్తా సంత రించుకోగలం. చరితగా చదివే తరములకు మనమో స్ఫూర్తి సంతకం అవుతాం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
  6. 6. “అన్వేషణ” మానవుని సహజ లక్షణం- తన అన్వేషణలో ఆహార సంపాదన, ఆరోగ్య పరిరక్షక చర్యలలో, ప్రయాణ సౌకర్యాలలో, ఇంకా సుఖమయ జీవితానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఆవిష్కరిస్తూ సాగిపోతున్నాడు మనిషి. తత్ఫలితాలు వాస్తవమైన, నిర్భయమైన సుఖాన్ని అందివ్వకపోగా, ఆందోళనలకు దారి తీయగా, ఆవిష్కరణ పరంపరలో తన ఉనికికి సంబంధించిన గతం- వర్తమానం-భవిష్యత్తు గురించి సమాలోచనలు ఆంతర్యాన్ని చుట్టుముట్టగా, సత్యాన్ని ఆవిష్కరించ పూనుకున్నాడు మనిషి. “సత్యం” అతని ముంగిటకొచ్చి పలుకరించినా, నీ అన్వేషణ వాస్తవ ఫలితాన్ని నేనేనని ఘోషించినా ఏదో విషయం అతన్ని మోసంలో పడవేసింది. సరే ఇక చాలు! వివిధ ధార్మిక గ్రంథాల ఆధారాలతో నీవు విస్మరించిన ఈ సత్యాన్ని తిరిగి నీ ఎదుటకు తీసుకురాబడుతుంది. ఓ మిత ్ర మా! నీకు స్వాగతం! సుస్వాగతం!! సృష్టి ఆవిర్భావం-బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఈ సృష్టి ఆవిర్భావం గురించి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డార్విన్ సిద్ధాంతమేమిటో కాస్త గమనించండి: “విశ్వంలో ఫుట్బాల్ బంతిలా ఒక జడపదార్థం, అందులో ఎన్నో పదార్థాలు, మరెన్నో కణాల సముదాయం ఉండేది. నేటికి దాదాపు ఇరవై బిలియన్ సంవత్సరాల పూర్వం విశ్వంలో ఒక విస్ఫోటనం జరిగి జడపదార్థం చెల్లాచెదరయి విభిన్న స్థానాలలో పొందికగా అమరింది. వీటిని నేటి మానవుడు పాలపుంతలు, గ్రహాలు, నక్షత్రాలుగా పిలుస్తున్నాడు.” ఈ సిద్ధాంత సారాంశము ఏమనగా విశ్వంలో ఒక జడపదార్థం ఉండేదని, అది విస్ఫోటనం చెందడం వలన ప్రస్తుత సృష్టి ఉనికిలోకి వచ్చిందని- దీనిని కొంత విషయం అవగతమవుతుంది.విస్ఫోటనం పదార్థాల విచ్ఛిన్నానికి కారణమవుతుందనేది సాధారణ విషయమే. కాని ఆలోచనకు దారితీసే విషయమేమనగా పదార్థ చిన్నాభిన్నానికి కారణమయ్యే విస్ఫోటనం ద్వారా వివిధ ద్రవ్యరాశులుగల, వివిధ గుణాలు గలిగిన పదార్థాలుగా, పాలపుంతలు, సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు, భూమిగా విడిపోయి ఒక క్రమమైన నిర్మాణంగా, నిర్దిష్టమైన దూరాలలో కక్ష్యలేర్పరు చుకుని పరిభ్రమించడం ఎంతో అందంగా, శాస్త్రీయంగా ఈ ఏర్పాటు జరగడం వెనక ఎవ్వరూ లేరని అనగలమా? పై వివరణ ల వల్ల ఇంతటి అద్భుతంగా, శాస్త్రీయంగా ఈ విశ్వాన్ని మలచిన కర్త ఒకడు ఉన్నాడని, ఆ శక్తి అద్వితీయమని నిరూపణ అవుతుంది. అద్వితీయమైన శక్తిని గురించి ధార్మిక ఓ మిత్రమా! నీ జీవిత పయనమెటు..? వికాసం
  7. 7. గ్రంథాలు ఏమంటున్నాయి? దివ్యఖుర్ఆన్: మానవులారా! మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. అప్పుడే మీరు రక్షించబడతారని ఆశించగలరు. ఆయనే మీ కోసం నేలను పడకగా, నింగిని కప్పుగా చేశాడు. పైనుండి వర్షం కురిపించేవాడు కూడా ఆయనే. ఆ వర్షం ద్వారా ఆయన రకరకాల పండ్లూ, పంటలు పండించి మీకు ఆహారం సమకూర్చి పెడ్తున్నాడు. ఈ యదార్థాలు తెలిసిన తరువాత మీరు ఇతర శక్తుల్ని అల్లాహ్ కు సాటి కల్పించకండి. (దివ్యఖుర్ఆన్: 2 / 21-22) ఇలా ప్రకటించు: ఆయన అల్లాహ్‌, ఏకైక దేవుడు. అల్లాహ్ ఎవరి అవసరమూ లేని నిరపేక్షాపరుడు. ఆయనకు ఎలాంటి సంతానం లేదు. ఆయన ఎవరికీ సంతానంగా లేడు. ఆయనకు సమానమైన వారెవరూ లేరు. అల్లాహ్‌ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు. (ఇక్లాస్: 1-4) మానవులారా! ఒక ఉదాహరణ ఇస్తున్నాం, జాగ్రత్తగా వినండి: మీరు (నిజ ఆరాధ్యుడైన) అల్లాహ్ ను వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలన్నీ కలసి కనీసం ఒక ఈగనైనా సృష్టించదలచుకుంటే, దాన్ని కూడా సృష్టించలేవు. పైపెచ్చు ఆ ఈగ ఆ మిధ్యాదైవాల దగ్గర్నుంచి ఏదైనా వస్తువుని ఎగరేసుకుపోతే ఆ వస్తువుని కూడా అవి దాన్నుండి విడిపించుకోలేవు. సహాయం అర్థించే వారు, సహాయం అర్థించబడేవారు ఇద్దరూ బలహీనులే. అసలు శక్తిమంతుడు, గౌరవనీయుడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్‌ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.(హజ్జ్: 73-75) వేదాలు: 1. ఆయన ఒక్కడే, ఆయన్నే ప్రార్ధించండి. - (ఋగ్వేదం 4-5-6:26) 2. శక్తిమంతుని యొక్క ఎటువంటి విగ్రహచిత్రరూపాలు లేవు. (ఇక అతని నామమే సర్వస్త్రోత్రము. (యజుర్వేదం- 9:40) 3. ఎవరయితే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో ఆ దేవుడు ఒక్కడే, ఓ జ్ఞానులారా! ఆయనను రెండవవానిగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకరు లేరు. (శ్వేతాశ్వతరోపనిషత్తు-3:2) 4. దేవుని రూపము ఇంద్రియాల పరిధిలో నిలవదు కన్నులతో ఆయననెనవ్వరూ చూడలేరు. (శ్వేతశ్వతరోపనిషత్తు) నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు, ప్రకృతికి పరమై విలసిల్లినట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడనగు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. (గీత-7:24) బైబిల్: దేవతలనబడిన వారునూ, ప్రభువులనబడిన వారునూ అనేకులున్నారు. ఆకాశమందైననూ, భూమి మీదనైననూ మనకు ఒక్కడే దేవుడున్నాడు. (1వ కొరింధి 8:6) అందుకు యేసు నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరెవరునూ సత్పురుషుడుకాడు. (లూకా 18:19, మార్కు 10, 18) మానవులందరికి సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆయన విభిన్న వర్గాల ప్రజలకు వేరువేరు ఆరాధన పద్ధతులు సూచిస్తాడా? ఎంత మాత్రం కాదు. మానవులందరికి ఏకేశ్వరుడే దైవమైనప్పుడు మానవులందరు సమానులే, సోదరులే. యావత్ ప్రపంచం ఒకే జీవన స్రవంతిగా మారాలంటే అది ఇస్లామీయ సిద్ధాంతాల ద్వారా, నిజ ఆరాధ్యుడు ఒక్కడే అని నమ్మడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరించడం ద్వారా, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని చాటే ఒక వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యం.
  8. 8. 6 2023 వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (బనీ ఇస్రాయీల్: 86) ఆత్మ పరిచయం: ఆత్మ ప్రకాశమానమైనది. ఉచ్చ స్థితిలో ఉంటుంది, జీవం గలది, చైతన్యం గలది, సూక్ష్మమైనది. గులాబీలలో నీటి ప్రవాహంలా , ఆలివ్‌లలో నూనె ప్రవాహంలా, బొగ్గులో నిప్పులా - ఆత్మ అవయవాల ప్రధాన భాగాల్లో, నరనరాల్లో మమేకమయి ఉంటుంది. ఆత్మ అనే పదం ఖురాన్ లో 21 సార్లు వేర్వేరు అర్థాల్లో వచ్చింది. ఖురాన్ అన్న అర్థంలో: ప్రవక్తా! అలాగే మేము ఆత్మ (ఖురాన్) ద్వారా నీవద్దకు మా ఆజ్ఞల్ని పంపుతున్నాం. ఇంతకు ముందు నీకు గ్రంథం అంటే ఏమిటో తెలియనే తెలియదు. కాని ఆ తరువాత ఈ దివ్యావిష్కృతిని ఒక జ్యోతిగా చేసి మేము కోరిన మా దాసునికి రుజుమార్గం చూపుతున్నాం. నిస్సందేహంగా నీవు ప్రజలను సన్మార్గం వైపుకు నడిపిస్తున్నావు. (షూరా : 52-53) వహీ (దివ్యావిష్కృతి) అన్న అర్థంలో: ఆయన (అల్లాహ్) మహోన్నతమైన హోదా, అంతస్తులు కలవాడు, (సర్వాధికార) అర్ష్ అధీశుడు. ఆయన తన దాసులలో తాను తలచుకున్న వారిపై తన దివ్యావిష్కృతి (వహీ) అవతరింపజేస్తున్నాడు. వారు పరలోక సమావేశం రోజు గురించి హెచ్చరించాలన్నదే దీని ఉద్దేశ్యం.(మోమిన్: 15) దైవ దూతల నాయకులు జిబ్రయీల్ (అ) అన్న అర్థంలో: ముహమ్మద్‌ (స)! ఈ గ్రంథంలో మర్యం వృత్తాంతం ప్రస్తావించు. ఆమె ప్రజల నుండి వేరయి, తూర్పు వైపున ఏకాంత కుహరంలోకి వెళ్ళి తెరవేసుకొని కూర్చున్నది. అప్పుడు మేము ఆమె దగ్గరికి మా ఆత్మ (జిబ్రయీల్) ను పంపాము. అతను పరిపూర్ణ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. (మర్యమ్: 16-17) శక్తి, సహాయం, నిలకడ అన్న అర్థంలో: అల్లాహ్ వారి హృదయాల్లో విశ్వాసాన్ని దృఢంగా పాదుకొల్పాడు. పైగా తన దగ్గర నుండి స్ఫూర్తి ప్రసాదించి వారికి మరింత (ఆత్మ) బలం చేకూర్చాడు. (ముజాడలః - 20) ప్రవక్త ఈసా (అ) అన్న అర్థంలో: గ్రంథప్రజలారా! మీరు మీధర్మం విషయంలో అతిశయానికి పోయి హద్దులు మీర కండి. సత్యం తప్ప అల్లాహ్ కు మరే విషయాన్నీ ఆపాదించకండి. మర్యం కుమారుడు ఈసా మసీహ్‌ అల్లాహ్ ప్రవక్తలలో ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. కాకపోతే ఆయన “మర్యం దగ్గరకు దేవుడు పంపిన ఒక ఆజ్ఞ; దేవుని దగ్గరనుండి (మర్యంకు) పంపబడిన ఒక ఆత్మ మాత్రమే.” (ఈ ఆజ్ఞ, ఆత్మలే మర్యం గర్భంలో బిడ్డరూపం సంతరించుకున్నాయి.) కనుక మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి. ముగ్గురు (దేవుళ్ళు) అనకండి. అలా అనడం మానేస్తే అది మీకే క్షేమం. ఆత్మ ఆత్మ వాస ్త వికత వాస ్త వికత ఆత్మ వాస ్త వికత విజ్ఞానం అబుల్ హసన్
  9. 9. 7 2023 నిజానికి అల్లాహ్ ఒక్కడే. ఆయనకు కుమారుడున్నాడని అనడం తగదు. అలాంటి బలహీనతలకు అల్లాహ్ అతీతుడు, అలాంటి బలహీనతలకు అల్లాహ్ అతీతుడు, ఎంతో పరిశుద్ధుడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం అల్లాహ్ దే. అన్నిటికీ ఆయనే స్వామి, యజమాని. వాటి సంరక్షణ, నిర్వహణలకు ఆయన ఒక్కడే చాలు. (171) మానవ జీవితం అన్న అర్థంలో: వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (బనీ ఇస్రాయీల్: 85) అల్లాహ్ కారుణ్యం అన్న అర్థంలో: నాయనలారా! వెళ్ళి యూసుఫ్‌ గురించి, అతని తమ్ముడ్ని గురించి ఆరా తీయండి. అల్లాహ్ కారుణ్యం (రౌహ్) పట్ల నిరాశచెందకండి. అల్లాహ్ కారుణ్యం (రౌహ్) పట్ల అవిశ్వాసులు మాత్రమే నిరాశ చెందుతారు”అన్నాడు యాఖూబ్‌. (యూసుఫ్: 86- 87) ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనేది శరీరం కాదు. శరీరం విధిని అంగీకరిస్తుంద. ఆత్మ భౌతిక దేహానికి భిన్నమైనది. శరీరం అంతరిస్తుంది కానీ, ఆత్మకు అంతం లేదు నిజమేనా? పండితులు ఏకాభిప్రాయం ప్రకారం ఆత్మ కూడా సృష్టియే. శరీరం అంతరిస్తుంది కానీ, మానవ ఆత్మకు అంతం లేదు. అంటే, సృష్టిరాసులకన్ని అంతం ఉన్నట్లే, వాటి ఆత్మలు కూడా నశిస్తాయి. మానవుల, జిన్నాతుల, దైవ దూతల ఆత్మలకు అల్లాహ్ తరపు నుండి ఒకింత మినహాయింపు ఉంటుంది. ఆత్మ రకాలు ఆత్మ మూడు రకాలు, చెట్టు చేమల ఆత్మ, జంతు ఆత్మ, మానవుల, జిన్నాతుల, దైవ దైవ దూతల ఆత్మ.ఈ మూడింటిని సమానంగా పరిగణించ లేము. వీటిలో, నిజ జీవితానికి మరియు సమగ్ర పరిపూర్ణతలకు అర్హత గలది మానవుల ఆత్మ మాత్రమే. పైగా మానవాత్మకు అల్లాహ్ ప్రసాదించిన శ్రేష్ఠత రీత్యా ఒకింత ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే సృష్టి శ్రేష్ఠుడు మనిషి గనక. మిగిలిన జంతువులు మరియు వృక్ష ఆత్మలు కూడా ఒక రకమైన జీవితాన్ని కలిగి ఉంటాయి. కానీ అవి మానవ ఆత్మతో సమానం కాదు. ఈ ఆత్మలు కొన్ని ప్రత్యేక లక్షణాలలో మానవ ఆత్మను పోలి ఉండవచ్చు. కానీ మనిషిలో మరియు వాటి మధ్య బాహ్య వ్యత్యాసం ఉన్నట్లే, ఆధ్యాత్మిక వ్యత్యాసమూ ఉంది. ఇస్లాం మానవాత్మకు ఇచ్చే గౌరవం “ఎవరైనా ప్రతీకార హత్య(శిక్ష)గా లేక ధరణిపై కల్లోలం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషినైనా చంపితే అతను యావత్తు మానవాళిని చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళిని కాపాడినట్లే.” (మాయిదహ్: 32) అకాల మరణం చెందిన ఆత్మలు దెయ్యాలవుతాయా? ఇస్లాంలో అకాల వర్షాలు, అకాల మరణాలు అనే భావనకు చోటు లేదు. ప్రతిదీ నిర్ణీత సమయానికే సంభవిస్తుంది. అకాల మరణమే లేనప్పుడు ఆత్మలు దెయ్యాలవుతాయి అనడం హాస్యాస్పదం. ఆత్మలు తిరిగి వస్తాయా? మానవుడు మరణించినా, మానవుడుని జంతువులు తిన్నా, మానవుడుని అగ్నికి ఆహుతి చేసినా, మానవుడు బూడిదగా మారినా మరణించిన వారు బర్జఖ్ లో ఉంటారు. ఇహాలోకంలోకి తిరిగి రావడం అనేది జరగదు. ఇది అల్లాహ్ సంప్రదాయానికి విరుద్ధం. చాలా మందికి మృతుడు చనిపోతే ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు. వాస్తవం ఏమిటంటే, మృతుడు చనిపోయిన వెంటనే బర్జఖ్ లో బంధించబడతాడు. తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి అందరినీ మహాషర్ మైదానంలో సమావేశపరుస్తాడు. అప్పటి నుంచే ‘పరలోకం జీవితం’ మెుదలవుతుంది.
  10. 10. ప్రపంచ మానవాళి సన్మార్గాన నడవాలన్నా, వారికి జీవిత అన్ని రంగాల్లో, అన్ని అంగాల్లో సంపూర్ణ మార్గదర్శకత్వం కావాలన్నా, వారు ఇహ పరాల విజయబాటన పయనించాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. ''అది సమస్త మానవాళి కోసం వచ్చిన గ్రంథం. యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్‌ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు''. (ఫుర్ఖాన్‌ -1) సవ్యమైన బాట వైపు తీసుకెళ్ళే గ్రంథం ''నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరిఅయిన (సవ్యమైన) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కా ర్యాలు చేస్తూఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫల ముందని శుభవార్తనూ అందజేస్తుంది''. (ఇస్రా: 9 -10) ఒక జాతి పురోభివృద్ధిని సాధించాలన్నా, అభ్యుదయ బాటన అనునిత్యం నిత్యా నూతనంగా నడవాలన్నా, ప్రగతి పథాన ప్రథమ స్థానంలో పది కాలాల పాటు పదిలంగా ఉండాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. ఎందుకంటే, జాతుల భవితవ్యం ఖురాన్ . “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథ ఆధారంగా (ఈ గ్రంథానికనుగుణంగా జీవించిన కారణంగా) కొన్ని జాతులకు కీర్తి కిరీటాలు తొడిగి., విజయ శిఖరాల మీద కూర్చోబెడితే, మరికొందరిని (ఈ గ్రంథం ఎడ్ల విముఖత చూపిన కారణంగా) అధఃపాతాళానికి నెట్టి వేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం) ఖురాన్ వైపు మనం ఎందుకు మళ్ళాలి? అంటే, అది మనందరి కోసం, మానవులందరి కోసం వచ్చిన అంతిమ ధర్మ శాస్త్రం. ఇది కాల్పనిక సిద్ధాంతం కాదు ఈ రోజు పాటించి రేపు వదిలేయడానికి. ఇది సమస్త లోకాల ప్రభువు సమస్త మానవాళికి అనుగ్రహించిన శాశ్వత ధర్మ శాస్త్రం. ''నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము". (హిజ్ర్: 9) గత చరిత్రలో జరిగిన తప్పిదాలను గ్రహించాలన్న, మానవాళి మార్గభ్రష్టవ్వానికి అసలు కారణాలను తెలుసుకోవాలన్నా, ముఖ్యంగా మనిషి పురోగమన, మనం ఖురాన్ వ ై పు ఎందుకు మళ్ళాలి? ఖురాన్ దర్శిని 8 2023 శాంతి ప్రియ
  11. 11. తిరోగమనాల వాస్తవికతను అర్థం చేసుకోవాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. "మానవులారా! మేము మీ దగ్గరికి ప్రయోజనకరమైన గ్రంథం పంపాము. అందు లో మీ గురించిన ప్రస్తావనే ఉంది. మరి మీరు విషయాన్ని అర్థం చేసుకోరా?" (అంబియా: 10) మనిషి జోక్యంతోటి మార్పు చేర్పులకు గురైన గత దైవ గ్రంథాల సత్యతను తెలుసుకోవాలన్నా, వాటిలోని అసలు సారాంశాన్ని గ్రహించాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. "చివరికి మేము సత్యపూరితమైన ఈ గ్రంథం నీపై అవతరింపజేశాం. ఇది ఇంతకు పూర్వం వచ్చిన దివ్యగ్రంథాలను ధృవీకరిస్తోంది. వాటన్నిటి సారాంశాన్ని కాపాడే గ్రంథం. కనుక నీవు అల్లాహ్ నిర్దేశించిన చట్టం ప్రకారమే ప్రజల వ్యవహారాలు పరిష్కరించు. నీ దగ్గరకు వచ్చిన సత్యాన్ని వదిలేసి వారి మనోకాంక్షలను అనుసరించకు". (మాయిదహ్; 48) మనిషి ఆర్థికంగా ఒకరిని అన్యాయం చేయకుండా అభివృద్ధి సాధించాలంటే ఖురాన్ వైపు మళ్ళాలి. "మీ సంపద నుండి మీరు (దైవమార్గంలో) ఏది ఖర్చుచేసినా అది మీకే లాభదాయకం. మీరు చేసేదంతా దైవప్రసన్నత కోసమే కదా! దైవప్రసన్నత కోసం మీరు ఏది ఖర్చుచేసినా దాని పుణ్యఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకేమాత్రం అన్యాయం జరగదు ". (బఖరః - 72) వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అనంటారు. కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు. వడ్డీని అధర్మ కార్యంగా నిర్ణయించాడు. కనుక ఈ హితబోధ అందినవారు ఇక ముందు వడ్డీ తినటాన్ని మానుకోవాలి. జరిగిందేదో జరిగింది. ఇకనుండి మానుకోవాలి. ఆలాంటివారి వ్యవహారం (రేపు) అల్లాహ్ పరిష్క రిస్తాడు. ఒకవేళ ఈ ఆదేశం అందిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా ఈ పాపకార్యానికి పాల్పడితే వారు నరకం పాలవుతారు. నరకంలోనే ఎల్లకాలం పడివుంటారు. (బఖరః - 72) 275) "మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించ కండి. ఇతరుల సొత్తు కాజేసే ఉద్దేశ్యంతో ఆ వ్యవహారాన్ని అధికారుల దగ్గరకు తీసికెళ్ళకండి". (బఖరః - 188) "కనుక వారు (ఇతరుల అనాథ పిల్లల విషయంలో కూడా) దేవునికి భయపడుతూ సవ్యమైన మాటనే పలకాలి. అన్యాయంగా అనాథబాలల ఆస్తుల్ని తింటున్నవారు నిజానికి తమ పొట్టలను అగ్నితో నింపు కుంటున్నారు. వారు తప్పక భగభగమండే అగ్నిగుండంలో విసిరేయబడతారు" . (అన్నిసా : 9-10) మనిషి మనో నేత్త్రం తెరుచుకోవాలన్నా, మనసును క్రమ్ముకున్న తమస్సు తుప్పు వదులగొట్టాలన్నా, మనో రుగ్మతలు పూర్తిగా నిర్మూలించబడాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. "మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది". (యూనుస్: 57-58) ఐహికంగా అభివృద్ధి అందలం ఎక్కిన మనిషి పారలౌకికంగా స్వర్గ శిఖర భాగం (జన్నతుల్ ఫిరదౌసిల్ అఅలా) మీద కొలుదీరాలన్నా ఖురాన్ వైపు మళ్ళాలి. మార్గదర్శక గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్‌కాలానుగుణంగా అవతరించిన ఆ గ్రంథాలు పరిమిత ప్రాంతానికి, పరిమిత జీవన విధానానికి చెందినవి. కానీ ఖుర్‌ఆన్‌ గ్రంథం అన్ని విధాల పరిపూర్ణ మైనది. అది వచ్చిందే మానవాళిని కర్రి మబ్బుల నుండి వెలికి తీసి వెలుగు ముగ్గులలో విహరింపజేసేందుకే. ”మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలిక తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను (వచనాలను) అవతరింపజేసినవాడు అల్లాహ్‌యే. నిశ్చయంగా ఆయన మీ యెడల మృదుస్వభావి, దయాశీలి.” (హదీద్: 9) 9 2023
  12. 12. 10 2023 ప్రవక్త ప్రియ సహచరుల (రజి) ఏకాభిప్రాయం పవిత్ర ఖుర్ఆన్, సున్నత్ ల తరువాత ముఖ్యమైన స్థానం ప్రవక్త ప్రియ సహచరుల అభిమతం. మహా ప్రవక్త (స) మరణానంతరం కొంత మంది బూటకపు దైవ ప్రవక్తలు పుట్టుకు వచ్చారు. వాళ్లు తమని తాము దైవప్రవక్తలుగా ప్రకటించుకున్నారు. అలాంటి వారిలో 'ముసైలమా బిన్ కజాబ్', 'అస్వద్ అనసి', ‘సజాహ’ ముఖ్యులు. కొందరు వారి మాటలను విశ్వసించారు. అలాంటి వారితో మొదటి మార్గదర్శక ఖలీఫా అబూ బక్ర్ (ర) యుద్ధం చేశారు. ఒక వేళ ఈ యుద్ధం మోస పూరితమైతే వారి స్త్రీలను సంతానాన్ని బానిసలుగా చేసేవారు కాదు. ధార్మిక పండితుల అభిమతం పవిత్ర ఖుర్ఆన్, సున్నత్ ల తరువాత, 'సహాబా' విధానం తరువాత నాల్గవ స్థానంలో ధార్మిక పండితుల మాట వస్తుంది. ఇస్లామీయ ధర్మ పండితులందరూ ప్రవక్త (స) తరువాత మరే ప్రవక్తా వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఉదా: ప్రముఖ ధార్మిక పండితులు అల్లామహ్ 'ఇబ్నె జరీర్' (రహ్మలై) ఇలా తెలిపారు: “ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసిన తరువాత దానిపై సీలు వేయ బడింది. ఆ తలుపులు ప్రళయదినం వరకు ఎవరి కొరకూ తెరుచుకొనబడవు”. (తఫ్ సీర్ ఇబ్ నే కసీర్) ప్రముఖ ధర్మవేత్త, పవిత్ర ఖుర్ఆన్ వ్యాఖ్యాత 'ఇబ్నె కసీర్' (రహ్మలై) - ఇలా తెలుపుతున్నారు : ప్రవక్త ముహమ్మద్ (స) తరువాత మరే ప్రవక్త గానీ సందేశహరులు గానీ రారు”. (తఫ్సీర్ ఇబ్నె-కనీర్) అల్లామా 'షహరిస్తానీ' ఇలా తెలుపుతున్నారు: “ప్రవక్త ముహమ్మద్ (స) తరువాత మరో ప్రవక్త వస్తారని ఎవరైనా అంటే ఇక ఆ వ్యక్తి అవిశ్వాసి అనడంలో ఏ ఇద్దరి మధ్యా అభిప్రాయబేధం ఉండదు.” మరో ప్రవక్త అవసరం ఉందా? పవిత్ర ఖుర్ఆన్ ను శ్రద్ధగా అధ్యయనం చేయటం వల్ల తెలిసే విషయం ఏమిటంటే..... దైవ ప్రవక్తలు నాలుగు కారణాల దృష్ట్యా పంపబడ్డారు. 1) ఏ ప్రదేశంలోనైనా ప్రవక్త పంపబడక పోవడం వల్ల లేదా ప్రవక్త సందేశం వారికి అందకపోవడం అంతిమ దైవ దౌత్యాన్ని విశ్వసించటం అంతిమ దైవ దౌత్యాన్ని విశ్వసించటం ద ై వదౌత్య పరిసమాప్ తి ద ై వదౌత్య పరిసమాప్ తి ఆధ్యాత్మికం డా. సయీద్అ హ్మద్ మదనీ
  13. 13. 11 2023 వల్ల మునుపటి ప్రవక్తల సందేశాన్ని మరచి పోయినా లేదా ఆయన బోధనలను మార్చేసినా.. పూర్వపు ప్రవక్త ద్వారా ప్రజలకు మార్గదర్శకత్వం అంది ఉండకపోవటం చేత, దైవధర్మ పరిపూర్ణత నిమిత్తం మరి కొంతమంది ప్రవక్తల అవసరం ఉండటం చేత ఒక ప్రవక్త సహాయం కొరకు మరో ప్రవక్త రావలసి ఉండటం చేత....పై కారణాల వల్ల ప్రవక్తలను పంపడం జరుగుతుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ (స) తరువాత పై కారణాలు ఏవీ మిగలలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం సర్వమానవాళి కొరకు అని పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిస్తున్నాడు : " ఓ ముహమ్మద్! మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా పంపాము”. (అల్-అంబియా :107) 2) మహా ప్రవక్త ముహమ్మద్ (స) సందేశం సంపూర్ణ సందేశం అని పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిస్తున్నాడు “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”. (అల్ మాయిద:3) ముహమ్మద్ (స) వారి షరీయత్ ఈ ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది. దీనిలో ఎవరూ ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేరు. ఎందుకంటే దీని సంరక్షణ బాధ్యత స్వయంగా అల్లాహ్ యే తీసుకున్నాడు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: "మేమే ఈ ఖుర్ఆనను అవతరింప జేశాము, మరియు మేమే దీనిని రక్షిస్తాము”. (అల్ హిజ్ :09) అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలగవచ్చు. ప్రవక్తల పరంపర పూర్తయిన తరువాత ప్రళయం వరకు ధర్మసంస్థాపన ఎవరు చేస్తారు? ప్రజలకు దైవ మార్గం, సందేశం ఎవరు చేరవేస్తారు? ప్రవక్తల పరంపర పూర్తయిన తరువాత ఈ కీలక బాధ్యత ధార్మిక పండితులపై ఉంటుంది. ఎందుకంటే వారే ప్రవక్తలకు వారసులు. అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ధార్మిక పండితులు ప్రవక్తలకు వారసులు. వారు దీనారులు, దిర్హముల (ఆస్తి పాస్తుల)ను వారసత్వంగా వదలి వెళ్ళరు. వారు తమ విద్య (జ్ఞానాన్ని) వదలి వెళతారు. వారు ధర్మజ్ఞానానికి వారసులు.” అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ హజ్ యాత్రలో ఇలా ఉపదేశించారు :“మీలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు ఇక్కడ లేని వారికి (హాజరు కాని వారికి) నా సందేశాన్ని చేరవేయండి”. నేడు సమాచారాన్ని చేరవేయటానికి అనేక ఆధునిక మార్గాలు, ప్రచార, ప్రసార సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సమాచారాన్ని ఎంతో సులభంగా, అతి వేగంగా ప్రపంచ నలుమూలలా చేర్చగలుగుతున్నాము. అంతిమ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు : “ ఒకవేళ నా సమాజంలో ప్రవక్త మూసా (అ) వచ్చి వుంటే ఆయన కూడా నన్ను విశ్వసించి అనుసరించడం తప్ప మార్గాంతరం ఉండేది కాదు. ప్రవక్త ఈసా (అ) కూడా ప్రళయానికి ముందు ప్రవక్త (స) అనుసరణీయుడిగా ఆయన (స) సమాజానికి చెందిన వాడిగా వస్తారు తప్ప మరో ప్రవక్తగా రారు”. ఎవరైనా ప్రవక్తగా, ప్రకటించుకుంటే అతన్ని ప్రవక్తగా నమ్మవలసి ఉంటుందా..? ఒకసారి ఆలోచించండి..! అలా ప్రకటించుకున్న వాడు సంత్యవంతుడా? అసత్యవాదా?..? నిస్సందేహంగా అతను అసత్యవాదే, వంచకుడే. అంతే కాకుండా మన మౌలిక విశ్వాసా లకు సంబంధించిన 'అంతిమ దైవ దౌత్యం' పై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిగా, అల్లాహ్ ఆదేశాలు నిరాకరించిన వ్యక్తిగా తన పరలోక జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్న 'మహా దౌర్జన్యపరుడి'గా మిగిలి పోతాడు. అలాంటి వారికి ఇస్లాం ధర్మంలో స్థానం లేదు. వారు ముస్లిములు కారు. అలాంటి అసత్య ప్రవక్తలను విశ్వసించేవారు, ఆదరించేవారు కూడా అవిశ్వాసులే. అల్లాహ్! ఇలాంటి వారికి సన్మార్గాన్ని అధ్యయనం చేసి దానిని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు.. ఆమీన్. అల్లాహ్ మనల్ని ఋజుమార్గం పొందిన తరువాత మార్గ భ్రష్టత్వం నుండి కాపాడు గాక! ఆమీన్!
  14. 14. 12 2023 ఇస్లాం మానవాళికి చేసే స్వచ్ఛమైన బోధనలలో, ఒకవైపు విశ్వాసాలు, ఆరాధనలు , సంఘ జీవన వివరాలు , సామాజిక వ్యవహారాలు మరియు నైతిక నియమావళి, సంస్కారం, గౌరవ మర్యాదలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రధానంగా ప్రస్తావించ బడ్డాయి. మరో వైపు నైతిక పరిమితుల్లో ఉంటూనే వాంఛనీయమైన వినోదం, ఉల్లాసం, ఆటలు, పోటీలు, వివిధ రకాల కళలు కూడా అనుమతించ బడ్డాయి. అలాగే సంఘ శ్రేయానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగ పడే క్రీడలు ప్రోత్సహించ బడ్డాయి కూడా. ఇస్లాం బద్ధకం, సోమరితనాన్ని మరియు కార్యశూన్యతను ఇష్ట పడదు, చురుకుదనం, ఉల్లాసాన్ని, కార్యనిపుణతను ఇష్ట పడుతుంది. సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఇలా చెబుతున్నాడు: కపటులు ప్రార్థన కోసం నిలబడినప్పుడు, వారు సోమరితనంతో నిలబడతారు.(సూరా అన్ -నిసా: 142) బద్ధకం, అతి నిద్ర, సోమరితనం , ఏ పని పాటా లేకుండా ఉండటం చాలా అవాంఛనీయమైనది, దైవ ప్రవక్త (స) ఈ విషయమై అల్లాహ్ శరణు వేడుకున్నారు. ఇస్లాంలో స్వచ్ఛమైన మరియు లక్ష్య సహిత వ్యాయామం మరియు క్రీడలు సమర్థించబడటమే కాక, అలాంటి వ్యాయామం మరియు క్రీడలు ప్రోత్సహించబడ్డ్డాయి కూడా. అలాగే శారీరక మరియు శారీరకేతర బలాన్ని సాధించడం ముఖ్య అంటుంది ఇస్లాం. అల్లాహ్ ఇలా చెబుతున్నాడు: పోరాడేందుకు కట్టివేసి (సిద్ధంగా ఉంచి)న గుర్రాలతో సహా వీలైనంత ఎక్కువ శక్తి సమకూర్చుకొని సర్వసన్నద్ధంగా ఉండండి.. (అల్-అన్ఫాల్: 60) “అల్లాహ్ మీకు బదులు అతడ్నే (ఈ పని కోసం) ఎంచుకున్నాడు. ఆయన అతనికి (కార్యసాధనకు కావలసిన) బుద్ధిబలాన్ని, కండబలాన్ని కూడా పుష్కలంగా ప్రసాదించాడు. (బఖరహ్: 247) సయ్యిద్ అబ్ దు స్సలామ్ ఉమరీ ఇస్లాం మరియు క్రీడా స్ఫూర్తి వినోదం ఉదయ భాను
  15. 15. 13 2023 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృఢమైన, ఆరోగ్యవంతమైన విశ్వాసిని ప్రశంసించారు. ఇలా అన్నారు: బలహీనమైన విశ్వాసి కంటే బలమైన, దృఢమైన విశ్వాసి ఉత్తముడు మరియు అల్లాహ్‌కు అత్యంత ప్రియమైనవాడు. (సహిహ్ ముస్లిం) హదీసులో, "బలం" అనేది శారీరక బలంతో పాటు ధైర్యం, ఆత్మ స్థయిర్యం, వెన్నుముక వ్యక్తిత్వం, వజ్ర సంకల్పాన్ని సూచిస్తుంది, తద్వారా ఒక దాసుడు ఆరాధన మరియు ఇతర ధార్మిక, ప్రాపంచిక, సాంఘిక కార్యాలను, కర్తవ్యాలను సులభంగా నిర్వర్తించగలడు. మనిషి ఆరోగ్యం మరియు భద్రతతో సంబంధం ఉన్న దేనినీ ఇస్లాం నిషేధించదు. వాంఛనీయమైన వ్యాయామం మరియు క్రీడలు మనిషి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే ఇస్లామీయ ఆచారాలకు చెడ్డపేరు తెచ్చే క్రీడలకు దూరంగా ఉండాలి. ఇస్లామీయ విలువలను దిగజార్చే వినోదాన్ని, ఆటలను, కళలను విడనాడాలి. ఇస్లామీయ ఆరాధనల ముఖ్య ఉద్దేశ్యం అల్లాహ్ ఆదేశ పాలన, అల్లాహ్ ప్రసన్నతే. ఈ ఆరాధన పద్ధతుల ద్వారా ప్రధానంగా ఎక్కడైతే ఆధ్యాత్మిక అభివృద్ధి సొంతమవుతుందో, అక్కడే పాక్షికంగా ఈ అద్వితీయ భంగిమల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వుజూ (శుచీ శుభ్రతలు) ద్వారా శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తే, నమాజులోని భంగిమలు, మరియు విధానం ద్వారా ఆత్మశాంతి, అంతర్మథనం సాధ్యమవుతుంది. శారీరక, ఆత్మ పరమైన వ్యాయామంలో ఉపవాసం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా, హజ్ కూడా ఓ గొప్ప శారీరక, ఆత్మ పరమైన వ్యాయామం, అల్లాహ్ ఇంటి ప్రదక్షిణ, సఫా మర్వా యొక్క సయీ, అరఫా మైదానంలో విడది, అరఫా నుండి ముజ్దలిఫాకు, ముజ్దలిఫా నుండి మినా వైపు వెళ్లడం అనేది ఇటు శరీరానిక, అటు ఆత్మకి బలాన్ని ఇచ్చే ఆరాధన విధానాలే. వీటి మూలంగా మనిషి శారీరక, ఆత్మ పరమైన శక్తి, సంతృప్తి లభించడమే కాక, ఈ క్రియలన్నీ అల్లాహ్ ప్రసన్నతకు, ఆయన సాన్నిహిత్యానికి తోడ్పడే అద్భుత సాధనాలు. గుర్రపు స్వారీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వతహాగా ఆరోగ్యవంతమైన దేహం కలిగి కాక, స్వయంగా తన సహచరులను వివిధ క్రీడా కార్యక్రమాలలో పాల్గొనమని ప్రోత్సహించే వారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వతహాగా ఒంటె సవారీ చేసేవారు, జీను లేకుండానే గుర్రపు స్వారీ కూడా చేసేవారు. గుర్రాల మధ్య పోటీని నిర్వహించి విజేతకు బహుమతిని ప్రదానం చేశారు. విలువిద్య: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "బాణాలు సంధించండి, నేను మీతో ఉన్నాను" (బుఖారీ) ఇంకో సందర్భంలో "వినండి! విలువిద్య బలానికి సంకేతం... అని మూడు సార్లు నొక్కి వక్కాణించారు . " (ముస్లిం) ఈత: మనకు బదులుగా ఒకరు చదవగలరుగానీ మనకు బదులుగా ఒకరు ఈత కొట్టలేరు. మక్కా, మదీనా పరిసరాలలో సముద్రం, నదులు లేనప్పటికీ, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులను ఈత నేర్చుకోమని ప్రోత్సహించేవారు. శరీరానికి వ్యాయామం చేయడానికి ఈత చాలా ప్రయోజనకరమైన క్రీడలలో ఒకటి. ఈత శరీరంలోని అన్ని భాగాలను బలపరుస్తుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: అల్లాహ్ స్మరణ నుండి విస్మరణకు గురి చేసే ప్రతి క్రీడ, కళ, ఆట అవాఛనీయ వ్యాపకమే. నాలుగు విషయాలు తప్ప: 1) ఒక వ్యక్తి తన భార్యతో గిల్లికజ్జాలాడటం. 2) తన గుర్రాన్ని తీర్చిదిద్దడం, తర్ఫీదు ఇవ్వడం 3) రెండు గురుతుల నడుమ (సపా మరియు మర్వాల మధ్య కొంత దూరం) కాలినడకన పరిగెత్తడం 4) మరియు ఈత నేర్చుకోవడం నేర్పించడం. ఈటె-విసరడం: విలువిద్య మరియు ఈటె-విసరడం
  16. 16. సిఫారసు చేయబడిన క్రీడలు. హజ్రత్ ఆయిషా సిద్ధిఖా (ర.అ) ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షి , ప్రవక్త (స) నా గది తలుపు వద్ద నిలబడి ఉండడం నేను చూశాను. కొంతమంది నీగ్రో వ్యక్తులు మసీదు వెలుపల ఉన్న ప్రాంగణంలో ఈటెలతో, బాలకులతో విన్యాసాలు చేస్తున్నారు. . ప్రవక్త (స) తన అంగీతో నన్ను కప్పగా, నేను ఆయన చెవులు మరియు భుజాల మధ్య నుండి కళా ప్రదర్శన చేస్తున్న అబిస్సీనియన్లను చూసేదానిని. (సహీహ్ బుఖారీ) కాలి నడక: దైవ ప్రవక్త (స) కూడా వ్యాయామంగా కాలి నడక సాగించేవారు.. హజ్రత్ అబూ హురైరా (ర) అంటున్న మాట - నేను ఆయనంత వేగంగా నడిచే వ్యక్తిని మరొకరిని చూడ లేదు. ఆయన అలా వడివడిగా నడిచి వెళుతుంటే ఇంత సువిశాలమైన భూమి ఆయన కోసం చుట్టివేయబడిందా? అనిపించేది. మేము ప్రవక్త (స)తో కలిసి నడిచినప్పుడు, మేము చాలా కష్టపడవలసి వచ్చేది, మేము అలసి పోయేవారం కానీ, ఆ శ్రమ ప్రభావం ప్రవక్త (స)పై కనిపించేది కాదు, ప్రవక్త (స) మక్కా నుండి తాయిఫ్ వరకు దాదాపు 110 కిలోమీటర్లు దూరం కాలినడకన వెళ్లారు. రన్నింగ్ రేస్: ప్రవక్త (స) సహచరులు సాధారణంగా పరిగెత్తేవారు, వారి మధ్య ఆరోగ్యవంతమైన పోటీ కూడా ఉండేది. బిలాల్ బిన్ సఅద్ (ర) ఇలా అన్నారు, ప్రవక్త (స) యొక్క సహచరులు చిహ్నాల మధ్య పరుగెత్తడం నేను చూశాను, వారిలో కొందరు నవ్వుతూ ఉన్నారు, అవును! రాత్రి కాగానే ప్రార్థనల్లో నిమగ్నమై ఉండేవారు. (మిశ్కాత్) మల్ల యుద్ధం మరియు కబడ్డీ: ఈ క్రీడల్లో పుష్కలమైన వ్యాయామయ సరుకు ఉంది. కనీస ఆచ్చాదనతో ఆడినట్లయితే, ఈ ఆటలు అనుమతించబడినవే. పైగా ఇవి మంచి కారణం కోసం ఆడితే చాలా హర్షణీయం కూడా. ప్రఖ్యాత అరబ్ మల్లయోధుడు రుకానా, దైవ ప్రవక్తతో కుస్తీ పోటీని నిర్వహించాడు, దైవప్రవక్త (స) అతనిని మల్ల యుద్ధంలో మట్టి కరిపించారు. (అబూ దావూద్) వాంఛనీయమైన ఆటలు అనుమతించబడ్డాయి. కానీ కొన్నిసార్లు చట్టబద్ధమైన ఆటలు కూడా అపరాధం స్థాయికి చేరుకుంటాయి, ఉదాహరణకు, వేట; అవసరం, ప్రయోజనం ప్రకారం దీన్ని చేయడానికి అనుమతి ఉంది, కానీ వేట యొక్క ఉద్దేశ్యం రక్తం, సరదా కోసం మాత్రమే అయితే, వేట కూడా అసహ్యమైన ఆటలలో చేర్చబడుతుంది. వేట ద్వారా ప్రజలు అణచివేయబడుతుంటే, అది కూడా నిషేధం, చట్టవిరుద్ధం. ప్రస్తుత కాలంలో క్రీడల తీరుతెన్నులు మారాయి. ఏది ఏమైనా అశ్లీలతను, నగ్నత్వాన్ని వ్యాప్తి చేసి, ఇస్లాంకు మచ్చ తెచ్చే ఏ క్రీడలకు ఇస్లాంలో స్థానం, అనుమతి లేదు, ఉండదు.
  17. 17. కృతజ ్ఞ త మూల్యం అమూల్యం కృతజ్ఞత అనే తాళం చెవి ద్వారా మనం ప్రతికూల విషయాలను, అనుకూల విషయాలుగా మార్చుకోవచ్చు. కృతజ్ఞత అనేది ఒక టీకా మందు. అది ఒక విషనాశిని. క్రిమి వినాశిని. మన దిన చర్యలో ఏ మంచి విషయం జరిగినా దానికి కృతజ్ఞత చూపాలి. అదెంత స్వల్పమైన, అల్పమైన సహాయం అయినా సరే జజాకల్లాహు ఖైరా (అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు గాక!), తవ్వలల్లాహు ఉమ్రక్ (అల్లాహ్ మీ ఆయుష్షును పెంచుగాక!), అల్లాహ్ యుస్యిదుక్ (అల్లాహ్ మిమ్మల్ని భాగ్యవంతులు జాబితాలో చేర్చు గాక!) అనడం అలవాటు చేసుకోవాలి. మనం మన రోజువారి జీవితాన్ని అల్లాహ్‌ కృతజ్ఞతతో ప్రారంభించాలి. మన ఆరోగ్యం,మన పరివారం, మన ఉద్యోగం, మన స్కిల్స్‌, మన ప్రతిభ, ప్రజలు మనలో ఇష్ట పడే గుణాలు, మనకు ప్రాప్తమయి ఉన్న స్థాయి గౌరవం అన్నీ అల్లాహ్‌ కృపాకరమే. నిజంగా చెప్పాలంటే, అల్లాహ్‌ కృపానుగ్రహాలను మనం లెక్కించాలన్నా లెక్కించ లేము. కాబట్టి అల్లాహ్‌ ఒక్కొ అనుగ్రహాన్ని తలచుకొని నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. వాక్కు పరమయిన కృతజ్ఞత, ధన పరమయిన కృతజ్ఞత, దేహ పరమయిన కృతజ్ఞను నిత్యం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది శుభాల తలుపుల్ని తెరిచే గొప్ప సాధనం. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నడు: ”ఒక వేళ మీరు కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను”. (ఇబ్రాహీమ్‌: 7) కృతజ్ఞతా భావం వల్ల మనలో సాత్విక భావాలు చోటు చేసుకొని, సానుకూల దృక్పథం అలవడి ఒక విధమయిన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది మనల్ని మరింత బలవంతులుగా తీర్చి దిద్దుతుంది. మునుపెన్నడూ ఎవ్వరికీ లభించని, ప్రళయం వరకూ ఇంకెవ్వరికి దక్కని గొప్ప రాజ్యాధికారం కలిగిన ప్రవక్త సులైమాన్‌ (అ) కృతజ్ఞతా పూర్వకంగా చెప్పిన వాక్యాలు మనకు ఆదర్శం. ”నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లిదండ్రు లకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా దీవించు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో”. (అన్నమ్ల్‌: 19) కృతజ్ఞత "జజాకల్లాహు ఖైరా" చిన్న మాటే. అయితే ఇది చెప్పేటప్పుడు హృదయ పూర్వకంగా చెప్పాలి. కృతజ్ఞతా పలుకులు మనం చెప్పేకొద్ది మన హృదయం కృతజ్ఞతతో నిండి పోవాలి. అప్పుడు మన నుండి ఎక్కువ ప్రేమ ప్రసరిస్తుంది. కృతజ్ఞత వల్ల నష్టపోయేది ఏమి లేదు. అది భూప్రపంచంలో సర్వ సంపదలకూ కారణం. మనం ఏ ఏ అనుగ్రహాలక యితే కృతజ్ఞతా భావంతో ఉంటామో అవి మనకు మరిన్ని రెట్లు అధికంగా లభిస్తాయి. అంతే కాదు, జీవితంలో దాపురించే ప్రమాదకర పరిస్థితుల నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఖురాన్ లో ఇలా ఉంది; దాని (శిక్ష) బారి నుండి లూత్‌ గృహస్థులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. వారిని మేము మా అనుగ్రహంతో (ఆ) రాత్రి తెల్లవారుజామునే అక్కడ్నుంచి వేరే చోటికి తరలించాం. ఇలా మేము కృతజ్ఞులైనవారికి ప్రతిఫలమిస్తున్నాం. (ఖమర్‌: 35) ఈరోజే కృతజ్ఞతని చూపించడం ప్రారంభించి మీ జీవితాన్ని అద్బుతంగా మార్చుకోండి. సల్మాన్ ఖాలిద్ ఆధ్యాత్మికం 15 2023
  18. 18. ఆయన ఎంతో ఉదార స్వభావుడు, సర్వం తెలిసిన వాడు. తాను తలచుకున్న వారికి వివేకం, విచక్షణ జ్ఞానం ప్రసాదిస్తాడు. వివేకం, విచక్షణల జ్ఞానం లభించినవాడు ఎంతో అదృష్టవంతుడు. నిజంగా అతనికి అపార సంపదలు లభించినట్లే. బుద్ధిమంతులు మాత్రమే (మా) హితోపదేశం గ్రహిస్తారు. (అల్ బఖరః: 268-269) ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మనది పోయేదేముందని ఎలా పడితే ఆలా మాట్లాడకూడదు. చిక్కులు కొనితెచ్చుకోకూడదు. అందుకు వివేకం ఎంతో అవసరం. వివేకం పుస్తక పొండిత్యం కాదు. అది దైవదత్త వరం. మనిషిని ఆపదల్లో చిక్కుకోకుండా తెలివితేటలతో బయటికి చేరుకొనేలా చేసి చక్కటి దారిచూపే దిక్సూచి. ఆయన మీకు ప్రసాదించిన మహా భాగ్యాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ శ్రేయస్సు కోసం అవతరింప జేసిన దివ్య గ్రంథాన్ని, (అందులోని) వివేకవంతమైన విషయాలను గౌరవించడం నేర్చుకోవలసిందిగా ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. (ప్రతి విషయంలోనూ) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సర్వం ఎరిగినవాడని తెలుసుకోండి. (231) అవివేకం మూర్ఖతకు నెలవు. ఆపదలకు నిలయం. వివేకం - అవివేకం బద్ధశత్రువులు. ఆవివేకానికి వివేకం అంటే ససేమిరా పడదు. ఒకటి అమృతం మరొకటి హాలాహలం. మనిషికి వివేకం తోడైననాడు ఎంతటి కష్టతర కార్యమైనా నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వివేకం లోపిస్తే పండితులు సైతం పరమ శుంఠలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వివేకం వివేచనకు అంకురం, బుద్ధి కుశలతతో చేపట్టిన ప్రతి కార్యంలో తెలివి పనిచేయడం ప్రారంభమవుతుంది. వివేకం, పరీక్షించి చూసే వరకు పరులను నమ్మవద్దని చెబుతుంది. వివేకం అపనమ్మకాన్ని ఆమడ దూరాన ఉంచమంటుంది. వివేకం కష్టాల కడలిని సులభంగా దాటిస్తుంది. అవివేకం మనిషిని వెర్రివాణ్ని చేసి అపహాస్యం పాలు చేస్తుంది. వివేకం ఆశాభావాన్ని రేకెత్తించి భుజం తట్టి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అతడికున్న చాపల్యాన్ని అరికడుతుంది. అవివేకి దానికి వశుడై నష్టపోతాడు. ఆతిని మితం గావించుకునే వివేకం మనిషికి నిరంతరం అవసరమే. లక్ష్యాలు, ఆశయాలు దీనితోనే సాకారం అవుతాయి. సాధారణ మనిషిని సైతం ఓ ఉన్నత స్థానంలో కూచుండబెట్టేందుకు వివేకం ఎంతగానో ఉపకరిస్తుంది. కర్తవ్యం అనే విత్తనాలను వివేకం అనే నీటితో తడిపి చల్లినట్లయితే ఈ క్రియ శరత్కాల పంటలా సత్ఫలితాలను సంపాదించి పెడుతుంది. వివేకం కలిగించే విచక్షణే దీనిక్కారణం. వివేకవంతుడు సన్నిహితుల మాటల్లోని మంచి చెడులను, మాయా మర్మాలను తనకు తానుగా తెలుసుకుంటాడు. సరైన నిర్ణయం తీసుకొంటాడు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, చేరుకో లేమనిపించినా ఎంతో కొంత దూరం ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి. లక్ష్యం చేరుకున్నామా లేదా అన్న దానికంటే ఎటువంటి కుయుక్తులూ పన్నకుండా ప్రయత్నం చేశామా లేదా అన్నది ముఖ్యం. విలువైనదాన్ని అందుకుంటున్నామనే భ్రమలో, ప్రయత్నంలో మన విలువల్ని తాకట్టు పెట్టకూడదు. జీవితంలో అనేక ఎత్తు పల్లాలుంటాయి. అన్ని రకాల మనుషులతో, భిన్న పరిస్థితుల్లో ముందుకు సాగిపోవలసిందే. కొన్ని సార్లు సాగిపోవడం తేలికగానూ, మరికొన్ని సార్లు కష్టతరంగానూ అనిపిస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండాలని ఎక్కడుంది. పరిస్థితులు ఎటువంటివైనా మన వివేకంతో అతి తక్కువ ఘర్షణ, ప్రతిఘటనలతో జీవనయాత్ర సాగించగలగడం ముఖ్యం. విజయానికి వారధి వివేకం విజయానికి వారధి వివేకం విజ్ఞానం నిసార్ ఆబిద్
  19. 19. మీకు లభించినది . కేవలం అల్లాహ్‌నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా! (నహ్ల్: 53) సృష్టిలో ప్రతి ప్రాణికి జన్మతోనే అల్లాహ్ కొన్ని అమూల్య సంపదలిస్తాడు. వాటిలో మాతాపితలు. దేహం. నివాస ప్రదేశం. జీవన కాలం ముఖ్యమైనవి. ఆరోగ్యమతమైన అంగవైకల్యం లేని దేహం ఒక సంపద సుఖవంతమైన, సురక్షితమైన నివాస ప్రదేశం ఒక సంపద అన్నింటికంటే విలువైనది ఆయువుగా చెప్పుకొనే జీవితకాలం. ఆ జీవిత కాలంలో అదృష్టవంతులకే మాతా పితల ప్రేమ బహుకాలం దక్కుతుంది. దురదృష్టవంతులు బాల్యంలోనే ప్రథమ సంపదలైన తల్లినో, తండ్రినో లేక ఇద్దరిని పోగొట్టుకుంటారు. సంతానానికి బాల్యంలో యవ్వన తలిదండ్రులు దొరకడం గొప్ప అనుగ్రహమే, దానికన్నా గొప్ప అనుగ్రహం సంతానానికి వారి యవ్వనంలో వృద్ధ తల్లిదండ్రులు దొరకడం. మరియు మీరు అల్లాహ్‌అనుగ్రహాలను లెక్క పెట్ట దలచినా, మీరు వాటిని లెక్కపెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్‌క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. (నహ్ల్: 18) అల్లాహ్ ఇలా హితవు పలుకుతున్నాడు: “తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి. మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని 'ఉఫ్' అని కూడా విసుక్కోకండి. కసురు కుంటూ విదిలించి మాట్లాడకండి. వారితో గౌరవంగా మాట్లాడండి; దయాగ్రహృదయంతో, వినయంతో వారి ముందు తలవంచి ఉండండి. 'ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచి పోషించారో అలా నీవు వీరిని కరుణించు' అని ప్రార్థించండి.” (ఖుర్ఆన్17:23, 24) దైవప్రవక్త (స) ప్రవచనం: "వృద్ధులయిన తల్లి దండ్రులు ఇద్దరుగాని లేక వారిలో ఒకరుగాని బ్రతికుండగా (వారికి సేవచేసి) స్వర్గంలో ప్రవేశించలేకపోయిన వాడి ముక్కుకు మన్ను తగల! వాడి ముక్కుకు మన్ను తగల!! వాడి ముక్కుకు మన్ను తగల!!!” ఇలా ఆయన మూడు సార్లు శపించారు. (ముస్లిం) ప్రకృతి అంత సహజమైనది కన్నవారి ప్రేమ అల్లాహ్ సృష్టిని ఎంతో ప్రేమగా, అర్హతతో, అద్భుతమైన సృజనాత్మకతతో సృష్టించిన సుగని. ప్రకృతి ఒడి... తల్లి ఒడితో సమానమయినది.... అయితే కనులు తెరవగానే కనిపించే కమనీయ ఉదయ రేఖల్ని ఎందరు కనురెప్పల్లో దాచుకుంటున్నారు? పచ్చని పసిడి వెలుగులో పారిజాతాల కురిసే అచ్భుత జల్లుల్ని ఎందరు ఆలింగనం చేసుకుంటున్నారు? మనం ప్రకృతిలోనే బతుకుతున్నాం, ప్రకృతితోనే బతుకుతున్నాం. కానీ, మనసుతో కాదు, శరీరంతో. అందువల్లే. ఆనందం అందరాని అనుభూతిగా ఉంటోంది. మనం వెతుక్కునే చోట ఆనందం కనిపించదు. ఆనందం ఉన్న చోట్లను మనం గుర్తించలేక పోతున్నాం. ఇదే ఉదాహరణను అమ్మానాన్నలకు వర్తింపజేసి ఆలోచించాలి. ఆత్మ సమీక్ష చేసుకోవాలి. తల్లి ప్రేమలో, తండ్రి ఆలింగనంలో, బిడ్డ నవ్వులో, స్వార్ధంలేని భక్తిలో... తేనెలోని మాధుర్యంలా ఆనందం దాగి ఉంది. దాన్ని అనుభూతికి తెచ్చుకోవాలంటే మనకు మనసుతో ఎలా జీవించాలో తెలియాలి. మనసు మానవుడికి అల్లాహ్ యిచ్చిన భిక్ష. దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే, నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే. మనసును పవిత్రం చేసుకుని, మన సృష్టికర్త ప్రేమను నింపుకోవాలి. అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే నెమ్మదించిన మనసుగా, ప్రసాంత హృదయంగా మారిపోతుంది. అలా కాకుండా మనసును ప్రాపంచిక ప్రలోభాలు, తద్వారా కలిగే చికాకులతో నింపివేస్తే శిక్షగా మారి, కక్ష తీర్చుకుంటుంది. అమూల్య వరాలు అమ్మానాన్నలు నదా బుష్రా కుటుంబం

×